తెలంగాణ పల్లెల్లోని సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుతో ప్రజలు ఘనంగా జరువుకునే మాఘమమావాస్య జాతరకు కూడవెళ్లి రామలింగేశ్వర స్వామీ ఆలయం ముస్తాబైంది. ఈ నెల 11వ తేదీ నుంచి ఆలయం వద్ద జాతర సందడి నెలకొననుంది.
సిద్దిపేట జిల్లాలోని కూడవెళ్లి రామలింగేశ్వర స్వామి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నిర్వాహకులు. కూడవెళ్లి రామలింగేశ్వర స్వామీ జాతర జిల్లాలోనే ప్రసిద్ధి చెందింది. రొండో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన కూడవెళ్లి రామలింగేశ్వర స్వామీ జాతర ఉత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. దుబ్బాక మండలం రామేశంపల్లి గ్రామ శివారులోను కూడవెళ్లి వాగు ఒడ్డున వెలిసిన శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం భక్తుల పాలిట కొంగుబంగారంగా వెలుగుతున్నది. ఇక్కడ ప్రతి ఏటా మాఘమమావాస్య నుంచి ఐదు రోజుల పాటు జాతర ఉత్సవాలు జరుగుతాయి. కూడవెళ్లి వాగులో పుణ్యస్నానాలు చేస్తే పాపాలు తొలిగిపోతాయని భక్తుల విశ్వాసం. గోదావరికి ఉపనదిగా కూడా కూడవెళ్లి వాగును పిలుస్తుంటారు. రెండు వాగులు ఒక చోట కలిసే చోట రామలింగేశ్వరస్వామి ఆలయం వెలిసింది. ఈ రెండు వాగులు వెళ్లి మూడో వాగులో కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా పిలుస్తారు. మూడు వాగులుగా అనుసంధానమైన వీటిని కూడవెళ్లి �
...
https://www.youtube.com/watch?v=vf2zpQCh40c
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు // పాఠశాల పాత భవనాన్ని కూల్చి సామాగ్రి ఎత్తుకొని పోవడం పై ఆయన మండిపడ్డారు //
సిద్దిపేట జిల్లా తొగుట మండలం కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల రేకులను ఎత్తుకెళ్లిన దుండగులను శిక్షించాలంటూ దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.// తోగుట మండల పరిధిలోని గురుకుల పాఠశాల భవనంలో, ప్రస్తుతం కస్తూర్బా పాఠశాలను కొనసాగిస్తున్నారు//. పాఠశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పాఠశాలను కూల్చివేయడం జరిగింది.// పాత భవనంలో ఉన్న రేకులతో పాటు సామాగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.// వెంటనే సామాగ్రిని ఎత్తుకెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్, ఎంఈఓ, తాసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు// ప్రజాధనాన్ని దుర్వినియోగం తోపాటు ఎత్తుకెళ్లి ఉండవలెను చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు// ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి ,నిరంజన్ రెడ్డి పలువురు పాల్గొన్నారు//
...
https://www.youtube.com/watch?v=aJBjhulnEWc