#ayyappa #ayyappayemple #dubbak
దుబ్బాక పట్టణంలో అయ్యప్ప దేవాలయం ఏర్పాటు చేసుకోవడం ఎంతో శుభ పరిణామం అని రాజు గురుస్వామి ముస్తాబాద్, అయ్యప్ప సేవా సమితి చైర్మన్ చింత రాజు అన్నారు
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో నిర్మిస్తున్న అయ్యప్ప దేవాలయాన్ని అయ్యప్ప సేవా సమితి సభ్యులతో కలిసి రాజు గురుస్వామి సందర్శించారు. ఆయనను అయ్యప్ప సేవా సమితి సభ్యులు పూలమాలవేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయాన్ని నిర్మించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అయ్యప్ప దేవాలయం ఏర్పాటుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అయ్యప్ప దేవాలయం ఏర్పాటుకు కృషి చేస్తున్న దాతలకు సేవా సేవా సమితి సభ్యులు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అయ్యప్ప దేవాలయం పూర్తి చేసుకునేందుకు ప్రతి ఒక్క హిందు బాంధవుడు ముందుకు వచ్చి విరాళాలు అందజేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి సభ్యులు ప్రజలు పలువురు పాల్గొన్నారు
...
https://www.youtube.com/watch?v=48eDNTNOOC8
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=4owJxnzZAag