*బాల్యం నుంచే ఈ దేశం పట్ల, ఈధర్మం పట్ల ప్రేమ కలిగిన వ్యక్తిగా విధర్మమీయ దుర్మార్గులను ఎదురించి దేశంలో హిందూ సామ్రాజ్య ఆవిర్భావానికి పునాదులు వేసిన చత్రపతి శివాజీ మహారాజ్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్ అన్నారు.*
*చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా దుబ్బాకలో ఛత్రపతి శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఛత్రపతి చిత్రపటానికి పూలమాలవేసి ఈ సందర్భంగా బాలేష్ గౌడ్ మాట్లాడారు.*
*భారత దేశ సంస్కృతి సంప్రదాయాలను నాశనం చేస్తూ ఈ దేశ ప్రజలను బానిసలుగా చూసిన విధర్మమీయ మొగలాయి పాలకులను బాల్యం నుంచి ఎదిరించి దేశంలో హిందూ రాజ్యస్థాపనకు కృషి చేసిన వ్యక్తి చత్రపతి శివాజీ మహారాజ్ అని అన్నారు.*
*తన తల్లి ఉగ్గుపాలతో రంగరించిన దేశభక్తిని నరనరాల్లో నింపుకున్న చత్రపతి చిన్నప్పట్నుంచి దేశంలో జరుగుతున్న అరాచకాలను అకృత్యాలను ఎదుర్కోవడానికి తన స్వంత సైన్యం తయారుచేసుకుని మొగలాయి పాలకులను అంతం చేశారని అన్నారు.*
*నేటి యువత కూడా చత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకుని దేశంలో దేశానికి వ్యతిరేకంగా, ఈ ధర్మానికి వ్యతిరేకంగా పని చేస్తున్న వ్యక్తుల భరతం పట్టాలని అన్నారు.*
*ఈ కార్యక్రమంలో బిజెపి మున్�
...
https://www.youtube.com/watch?v=IYr-izCUFYA