Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=v4yEBTfJIcQ
#s2news #ramakkapet
చలివేంద్రం ను ప్రారంభించిన గ్రామ సర్పంచ్
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రామక్కపేట గ్రామంలో గురువారం నాడు గ్రామ పంచాయతీ వారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ చింతల పద్మ ప్రభాకర్,పంచాయతీ కార్యదర్శి రమ్య ఎంపీటీసీ సంగెపు శోభ స్వామి,వార్డ్ మెంబర్లు కలిసి చలి వేంద్రం ను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామంలో చలి వేంద్రంను ప్రారంభించడం జరిగిందని గ్రామ ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=b6FErYtcxsM
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తక్కువ మంది జనాలతో సీతారాముల కల్యాణ వైభవం నిర్వహించడం జరిగింది అనంతరం సీతారాముల ఊరేగింపు చిన్నపిల్లల కోలాటాలతో నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో హిందూ బంధువులు మరియు గ్రామ పెద్దలు గ్రామంలోని ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది
...
https://www.youtube.com/watch?v=wCIlhLYLIlM
#bestteacher #teachers #mirudoddi
ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన అనగానే ఉపాధ్యాయులు డుమ్మాలు కొడతారు.. సరైన బోధన చేయరు అంటూ విమర్శలు వినిపిస్తాయి. ప్రభుత్వ పాఠశాలలో మూడు సంవత్సరాలుగా ఒక్క సెలవు కూడా పెట్టకుండా విద్యార్థులకు మెరుగైన బోధన చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు ఓ ఉపాధ్యాయుడు..
సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం కాసులాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కృష్ణమూర్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పాఠశాలకు ఎనిమిది గంటల 15 నిమిషాలకే వచ్చి విద్యార్థులకు బోధన చేయడంతో పాటు గత మూడు సంవత్సరాల నుండి ఒక సెలవు కూడా పెట్టకుండా అంకితభావంతో పని చేస్తూ విద్యార్థులతో పాటు గ్రామస్తుల మన్ననలు పొందుతున్నాడు. ఉపాధ్యాయుడు పనిచేస్తున్న తీరు తెలుసుకున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు పాఠశాల ఆకస్మిక తనిఖీ వచ్చినప్పుడు ఉపాధ్యాయుడు కృష్ణమూర్తిని శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు సన్మానంతో మరింత బాధ్యత పెరిగిందని కృష్ణమూర్తి తెలిపాడు. సాధ్యమైనంత వరకు విద్యార్థులకు మెరుగైన బోధన అందించడమే లక్ష్యంగా వృత్తిలో కొనసాగుతానని వెల్లడించారు.
...
https://www.youtube.com/watch?v=ATK_VQ82qXs